Balakrishna: ఎన్టీఆర్ కు 'భారత రత్న' వస్తుందని ఆశిస్తున్న..బాలకృష్ణ 1 y ago
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కృష్ణా జిల్లాలోని తన స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించారు. తన తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన తర్వాత బాలయ్య తొలిసారి నిమ్మకూరు రావడంతో గ్రామస్థులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ.. తన తండ్రి ఎన్టీఆర్కు త్వరలోనే 'భారత రత్న' వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.